భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి సినిమాలు చేసి స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు మారుతీ.. అయితే ఇంకో ఇద్దరు దర్శకులు మంచి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి మొదట్లో మంచి సినిమాలు చేసి మారుతీ కి రివర్స్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల విమర్శలకు గురవుతున్నారు.. ఇటీవలే రవి బాబు క్రష్ అనే అడల్ట్ కంటెంట్ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేశాడు.. ఆ పోస్టర్ ని చూడగానే ఆ సినిమా ఎలాంటి దో అర్థం అయిపోతుంది. నచ్చావులే,అనసూయ, అవును, అమరావతి, వంటి విభిన్నమైన సినిమాలు చేసిన రవిబాబు ఇలాంటి సినిమా చేయడం అయన ప్రేక్షకులకు ససేమీరా నచ్చడం లేదు..