వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుందని నిర్మాత దిల్ రాజు చాలా కాలం క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్టే దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనులు కూడా వేగవంతం చేశాడు. అయితే అనూహ్యంగా లాక్ డౌన్ వచ్చి అందరి ప్లానింగ్స్ తలకిందులయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎఫ్3 ని లాంచ్ చేసే అవకాశాలు తగ్గిపోయాయి. ఎఫ్3కు క్యాస్టింగ్ కూడా భారీగా అవసరం ఉండటంతో కొన్నాళ్ళు పెండింగ్ లో ఉంచడమే మంచిదని నిర్ణయించుకున్నారట. దాంతో టైం వెస్ట్ చేయడం ఇష్టం లేని అనిల్ రావిపూడి సాయి పల్లవి తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని తెలుస్తుంది..