తారల పట్ల అభిమానం రకరకాలుగా బయటపడుతుంటుంది. తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తారు. అలాగే ఈమధ్య కథానాయిక అమలాపాల్ పట్ల ఆమె అభిమాని ఒకరు చూపిన అభిమానం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది.
అమలాకు చెందిన వివిధ సందర్భాలలోని ఫోటోలను ఆ అభిమాని సేకరించి, అందమైన ఆల్బంగా రూపొందించి పంపించాడట. అమల ఆర్టిస్టు కాకమునుపు మోడలింగు చేసేది.
అప్పటి ఫోటోలను కూడా ఆ అభిమాని ఆ ఆల్బంలో సేకరించి పెట్టడం అమలాని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడా ఆల్బంని తన బెడ్ రూంలో పెట్టుకున్నానని ఈ మల్లూ బేబీ హ్యాపీగా చెబుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: