ఇప్పటివరకు బ్రహ్మచారిగా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్న... మన హీరో ప్రభాస్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు అనే వార్త వైరల్ గా మారింది... రీసెంట్ గా ప్రభాస్ పెదనాన్న, ఒకప్పటి డైనమిక్ హీరో అయిన కృష్ణంరాజు  మీడియా ముందు మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి 'కమింగ్ సూన్'...అని అందర్నీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి మన బాహుబలి కి కాబోయే అరుంధతి ఎవరు అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు... అయినా ఓ మీడియా ప్రతినిధి ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు ను అడిగిన వెంటనే అంత క్లారిటీ గా కమింగ్ సూన్ అన్నారంటే ఇక ప్రభాస్ పెళ్లి  ఖరారు, తిరుగు లేదు అని కొందరు అంటుంటే... ప్రస్తుతం ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు మాత్రం కుదరదనే చెబుతున్నాయని మరికొందరు లెక్కలు వేస్తున్నారు...



ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో "రాదే శ్యాం " అనే వింటేజ్ లవ్ స్టోరీ చేస్తున్నారు డార్లింగ్.. ఆ తదుపరి వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సోషియో సైంటిఫిక్ ఫాంటసీ కి ఆల్రెడీ కమిట్ అయ్యాడు మన చత్రపతి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్యూలో ఉన్నాయి. ఓ సినిమా సెట్స్ పై ఉంటే, మరొకటి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండగానే మూడో పాన్ ఇండియా ప్రాజెక్ట్ "ఆది పురుష్" కు సైన్ చేశారు ప్రభాస్..ఇలా ఇప్పటికే ఒప్పుకున్న బిగ్ సినిమా ప్రాజెక్టులతో మరో మూడేళ్లకు గాని ఫ్రీ అయ్యేలా కనిపించడం లేడు ప్రభాస్.



ఇక బాహుబలి పెళ్లి అంటే ఆషామాషీ విషయం కాదు అంత టైమ్ ఇప్పట్లో ప్రభాస్ కి లేదు కాబట్టి పెదనాన్న కృష్ణం రాజు ఇచ్చిన ప్రభాస్ పెళ్లి స్టేట్మెంట్ కు స్టే పడనుందని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్ళి మాట మరో మూడేళ్ల తర్వాతే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: