పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా అత్తారింటికి దారేది. 2013లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందించాడు. అంతకు ముందు పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జల్సా మంచి విజయాన్ని అందుకోవడంతో దీనిపై ప్రేక్షకాభిమానుల్లో బాగా అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే రిలీజ్ తర్వాత అందరి అంచనాలను అందుకొని మరింత గొప్పగా సక్సెస్ అందుకున్న ఈ సినిమా తో త్రివిక్రమ్ కు బాగా పేరు లభించింది. కాగా ఈ సినిమా కథ ప్రకారం ఎన్నో ఏళ్ళ క్రితం తన ఇంటి నుండి వెళ్ళిపోయిన మేనత్తని తిరిగి తీసుకురావటానికి హీరో ఆమె వద్దకు వెళ్తాడు. ఇదే బేసిస్ పాయింట్ కి కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కమర్షియల్ హంగులు కలబోతగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట.
14 రీల్స్ ప్లస్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా కథ ప్రకారం కొన్నేళ్ళ క్రితం తన మేనత్త ద్వారా తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్దమైన హీరో ఆమెను ఏ విధంగా ఆటాడించాడు అనే కాన్సెప్టుతో పలు కమర్షియల్ హంగులు జోడించి మంచి మెసేజ్ ను కూడా కలిపి దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తీస్తున్నట్లు చెప్తున్నారు. ఆ విధంగా ఆ సినిమాలో పవన్ అత్త కోసం వెళితే ఈ సినిమాలో మహేష్ తన తెలివితేటలతో అత్తని ఒక ఆటాడించనున్నాడన్నమాట. మరి ఈ సినిమా కథ గురించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే సర్కారు వారి పాటలు రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి