ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న విజయ్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఫైటర్. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం. విజయ్ ఈ సినిమా కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ కు జోడిగా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇక దీని అనంతరం ఇంద్రగంటి మోహన కృష్ణ తో ఒక సినిమా తో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా వాటిలో ముందుగా సుకుమార్ సినిమా ప్రారంభం అవుతుందని, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందనున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథను పూజాకి వినిపించిన దర్శకుడు సుకుమార్, ఆమె డేట్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. కేదార్ సెలగంశెట్టి నిర్మాతగా ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనుంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనిపై ఆ మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే ...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి