అయితే ఈ మధ్యనే తిరిగి షూటింగ్ ప్రారంభించారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ తన 5వ చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది రేసుగుర్రం రేంజ్లో ఉండబోతుందని సమాచారం. అక్కినేని అభిమానులు అఖిల్ ను ఎలా చూడాలి అని ఎదురుచూస్తున్నారో..
ఆ స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుందట.స్క్రిప్ట్ పనుల్లోనూ అలాగే ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ ఎటువంటి పొరపాటు జరగకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి పక్కా ప్లాన్ వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలో ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల వివరాలను కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి