ఇక బాహుబలి సినిమా తర్వాత ఆచితూచి అడుగు వేస్తున్నారు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. అన్ని భారీ చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరియర్ ని పూల బాట గా మలచు కుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం... ఆది పురుష్ వంటి భారీ ప్రాజెక్టు లతో బిజీగా ఉండగా....కేజీఎఫ్ సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డం దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, డార్లింగ్ ప్రభాస్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ వారు ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపిన మాట వాస్తవమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అంటున్నారు. కనుక వీరిద్దరి కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా రాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
అయితే ప్రభాస్ వరుసగా సినిమాలు కమిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు డేట్స్ కుదరడం లేదట. రానున్న రెండు సంవత్సరాల్లో మాత్రం అసలు తీరిక... సమయం లేని ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడి సినిమా ఖచ్చితంగా ఉండదని తెలుస్తోంది.. కానీ ఒక్కసారి ప్రభాస్ ఫ్రీ అవ్వగానే ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది.... సమయం కాస్త ఎక్కువ ఉండడంతో ప్రభాస్ కోసం భారీ కథను ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు ప్రశాంత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి