ప్రస్తుతం బొమ్మ అదిరింది షో ప్రతివారం బుల్లితెర ప్రేక్షకులందరికీ నాచురల్ కామెడీ పంచ్ లతో కడుపుబ్బ నవ్విస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతివారం సరికొత్త స్కిట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు బొమ్మ అదిరింది షో కాస్త ఎంతగానో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ఇటీవలే వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో ఇటీవల జీతెలుగు యాజమాన్యం విడుదల చేసింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే వచ్చేవారం అదిరింది షో కాస్త మరోసారి కడుపు నవ్వులు పంచే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ అదిరిపోయే స్కిట్ లతో ప్రోమో అలరించారు. ఇక ఫుల్ స్కిట్ చూస్తే కడుపుబ్బ నవ్వడం ఖాయం అన్న విధంగా ఉందిప్రోమో.
దీనికి సంబంధించిన ప్రోమో ప్రముఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ లతో వేణు ధనరాజ్ టీం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అనే విషయం తెలిసిందే. తమదైన కామెడీ టైమింగ్ తో ఎంతగానో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తారు అయితే ఈ వారం కూడా సరికొత్త స్క్రిప్ట్ తో తెరమీదకు వచ్చారు. ఈ క్రమంలోనే వేణు ధన్రాజ్ కి సంబంధించిన స్కిట్ ప్రారంభం కాగా.... ఇక రాజు వేషం లో వచ్చిన వేణు తనకు తన మామ పిల్లని ఇవ్వడంతోపాటు.. ఖడ్గం కూడా ఇచ్చాడు అంటూ తన దగ్గర పెట్టుకుని ఒక చిన్న కత్తిని చూపిస్తాడు. దీంతో వెంటనే పక్కనే ఉన్న శ్రీముఖి స్పందిస్తూ ఏంటి వేణు నీది ఇంత చిన్నగా ఉంది డబుల్ మీనింగ్ వచ్చే విధంగా కామెంట్ చేస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి