"తిమ్మరసు" ను సపోర్ట్ చేశాడు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇది ఏంటి కొత్త విషయం అనుకుంటున్నారా....?? తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సత్యదేవ్ నూతన చిత్రం పేరు "తిమ్మరుసు". తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ కూడా ఒకరనే చెప్పాలి. ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు హిట్ అయ్యాయా లేక ఫ్లాప్ అయ్యాయా పక్కనబెడితే నటుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తన ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపిస్తూ దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం సత్యదేవ్‌ నటిస్తున్న తాజా చిత్రం ''తిమ్మరుసు''. ఈ చిత్రంలో సత్యదేవ్ లాయర్ తిమ్మరుసు గా అవతారమెత్తాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈ సినిమాలో... న్యాయం కోసం ప్రాణమిచ్చే ఓ లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. టాక్సీవాలా సినిమా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది.కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్‌ కొప్పిశెట్టి ఈ చిత్ర దర్శకుడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'తిమ్మరుసు' సినిమా ఫస్ట్‌ లుక్‌ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది .

సత్యదేవ్ గెటప్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా తిమ్మరుసు టీజర్ ను పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో సత్య ఆదర్శమైన భావాలతో నిండి ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు... న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేసైనా సరే న్యాయాన్ని గెలిపించడం అతని నైజం అంటూ హీరో పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ఇక టీజర్ చూస్తే
కేసు గెలిచామా ఓడామా అన్నది కాదు ఇంపార్టెంట్‌.. సంపాదన ఎంతనేదే ఇంపార్టెంట్‌ అని ఓ వ్యక్తి అంటుండగా.. "నాకు మాత్రం న్యాయం జరగడమే ఇంపార్టెంట్‌ సార్‌" అని హీరో సత్యదేవ్  పలికిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది ఈ పవర్ ఫుల్ డైలాగ్. మరి సత్యదేవ్... తిమ్మరుసు ఖచ్చితంగా క్లిక్ అవుతుందని భావిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: