అవినాష్ టాప్ 5లో ఉంటాడు.. బిగ్ బాస్ వారు ఉంచుతారని అనుకోగా ఆడియెన్స్ అతన్ని టాప్ 5లో ఉంచనివ్వలేదు. ఇక బయటకు వచ్చిన అవినాష్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో కూడా చిట్ చాట్ చేశాడు. ఈ చాటింగ్ లో అందరు అడిగే కామన్ ప్రశ్న ఒక్కటే. అవినాష్ ఎప్పుడు జబర్దస్త్ లో కనిపిస్తాడు అని.. అవినాష్ తిరిగి జబర్దస్త్ కు వెళ్తాడా అంటే ఛాన్సే లేదని కొందరు లేదు అతన్ని వెనక్కి పిలుస్తారని కొందరు అంటున్నారు.
అంతకుముందు పటాస్ షోలో చేసిన శ్రీముఖి బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక మళ్లీ ఈటివి వంక చూడలేదు. స్టార్ మాలోనే షోలు చేస్తూ వచ్చింది. ఇక లేటెస్ట్ గా జీ తెలుగులో ఆమె సెటిల్ అయినట్టు అనిపిస్తుంది. ఇక అవినాష్ కూడా తిరిగి జబర్దస్త్ కు వెళ్లడం కష్టమే అని చెప్పొచ్చు. అయితే జబర్దస్త్ వాళ్లు పిలిచినా పిలవకపోయినా అవినాష్ కు జీ తెలుగు బొమ్మ అదిరింది షో నుండి మంచి ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది. జబర్దస్త్ నుండి కాల్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్తా అని అంటున్నాడు అవినాష్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి