మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ లాంటిగొప్ప హీరోల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.బాక్స్ ఆఫీస్ బద్దలుకొట్టి,భారీ హిట్లతో దూసుకెళుతున్న సీనియర్ మోస్ట్ అగ్రహీరోలుగా వీరు ఎప్పుడూ మొదటి స్థానం లోనే ఉంటారు.సినీ ఇండస్ట్రీలో వీరిద్దరూ బద్ధశత్రువులుగా నటించినా నిజ జీవితంలో మాత్రం ఆప్తమిత్రులు.
 మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన,బాలకృష్ణనే  ముందుగా వచ్చేది.నందమూరి బాలకృష్ణ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పెళ్లికి ఏర్పాటుచేసిన సంగీత్ లో బాలకృష్ణ వేసిన  డాన్స్ ఇప్పటికి నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది.అలాగే అల్లు అర్జున్ పెళ్లి కి, చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి కి,చిరంజీవి పుట్టినరోజున  ఏర్పాటుచేసిన పెద్ద పార్టీలతో  పాటు అన్ని శుభకార్యాలకు నందమూరి బాలకృష్ణ హాజరయ్యేవాడు.


కాని ఈ సారి  నిహారిక పెళ్లితో పాటు ఆమె వెడ్డింగ్ రిసెప్షన్ కూడా బాలకృష్ణ హాజరు కాకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యామిలీ అన్ని శుభకార్యాలకు ఎప్పుడూ ముందుండే బాలకృష్ణ ఈసారి మాత్రం నిహారిక పెళ్లికి హాజరు కాలేదు.ఇటీవల కాలంలో నాగబాబు బాలకృష్ణ తో చేసిన కామెంట్లు గురించి మనందరికీ తెలుసు వీరిద్దరి మధ్య చాలా కాలం నుండి కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. చిరంజీవి మీద చాలా సందర్భాలలో బాలకృష్ణ కోపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతోనే బాలకృష్ణను పలకరించేవాడు.బాలకృష్ణ కూడా అన్ని సందర్భాలలోనూ చిరంజీవి నాకు ఒక మంచి అప్పుడు అని చెప్పేవాడు.


అయితే కేసీఆర్ తో సినిమా గురించి జరిగిన మీటింగుకు కానీ, 1990 వ సంవత్సరానికి చెందిన స్టార్ హీరోలు అందరూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ చేసినప్పుడు కూడా బాలకృష్ణ కు ఆహ్వానం అందలేదు. అందుకు బాలకృష్ణ కోప్పడుతూ దశాబ్దాలుగా వస్తున్న మన స్నేహానికి మీరు ఇచ్చే విలువ ఇంతేనా.?  ఇంకెప్పుడూ మీ ఇంట్లో ఫంక్షన్ లకు గాని,పార్టీల గాని నన్ను పిలవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.బాలకృష్ణ ఈ మాటలు  అన్న తరువాత నిహారిక పెళ్లి జరగడంతో ఆ పెళ్ళికి బాలకృష్ణ హాజరు కాలేక పోవడంతో ఇప్పుడు అటు మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానుల మదిలో కూడా  బాలకృష్ణ చిరంజీవి ఇంకెప్పటికీ కలవడం జరగదా.?  అనే సందేహం కలుగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: