కళా తపస్వి.. పదుల సంఖ్యలో తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమాలకు ఒక గుర్తింపును తెచ్చి పెట్టిన దర్శకుడు.. కె.విశ్వనాథ్. సినిమా ఇండస్ట్రీలో సౌండ్ రికార్డిస్ట్ గా అడుగుపెట్టిన విశ్వనాథ్,  తన కెరీర్ లో మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి, ఆత్మ గౌరవం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. ఆ తరువాత  కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమా ఒక దర్శకునిగా మంచి పేరును సంపాదించి పెట్టింది...


ఇదిలా ఉండగా ఈయన ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు ఖ్యాతి ని మరింత పెంచాడు. అంతేకాకుండా కె.విశ్వనాథ్ భారతీయ కళల నేపథ్యంలో ఎన్నో సినిమాలను చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సాగర సంగమం, స్వర్ణకమలం, సిరివెన్నెల, స్వాతి కిరణం లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి, ఇలాంటి చిత్రాలు తాను తప్పా మరెవరు తీయలేరు అన్నంతగా ఎదిగిపోయాడు..


అంతేకాకుండా సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు, స్వర్ణకమలం లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టాయి.. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన కె విశ్వనాథ్, సరికొత్తగా సినిమాలలో నటించాలనుకొని, కొన్ని చిత్రాలలో కూడా  నటుడిగా నటించాడు..


ఇలా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, కళా తపస్వి గా పేరుప్రఖ్యాతులు గడించిన కె.విశ్వనాథ్ సినిమాలకు మాత్రమే కాదు ఒక సీరియల్ కు కూడా దర్శకత్వం వహించాడు. ఆ సీరియల్ లో స్వర్ణ పాత్రలో జ్యోతిరెడ్డి నటించగా, మంగళ పాత్రలో భానుప్రియ నటించారు. ఇలాంటి స్టార్స్ బుల్లితెరపై నటించడం ఈ సీరియల్ కు ప్లస్ పాయింట్ గా మారింది..


ఇలా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి సీరియల్ కు కూడా దర్శకత్వం వహించి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు కె.విశ్వనాథ్. ఇక ఆ తర్వాత తాతయ్య పాత్రలో కలిసుందాం.రా.., నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ వంటి సినిమాల్లో నటుడిగా నటించి, అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: