రామ్ చరణ్ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరువాత మరొక నటుడు ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి సిద్దమైన రామ్ చరణ్, ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఆ మూవీ యొక్క షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి తీస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన అనేక మంచి నటులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.

మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక దీనితో పాటు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కిస్తున్న ఆచార్య లో సిద్ద అనే కీలక పాత్ర చేస్తున్నారు చరణ్. తొలిసారిగా తండ్రి చిరంజీవితో చేస్తున్న సినిమా కావడంతో చరణ్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ని మరొక నిర్మాత నిరంజన్ రెడ్డి తో కలిసి చరణ్ కూడా నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. దేవాలయాలలో జరిగిన కొన్ని కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆచార్య గా మెగాస్టార్ కనిపించనుండగా ఆయన అనుచరుడైన కామ్రేడ్ సిద్ద పాత్ర లో చరణ్ కనిపించనున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.

కాగా ఈ మూవీ మే 13న రిలీజ్ కానుంది. అయితే దీని తరువాత దిల్ రాజు నిర్మాతగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు చరణ్. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, ప్రస్తుతం కమల్ తో భారతీయుడు 2 తీస్తున్న శంకర్, అది పూర్తి అయిన వెంటనే దీనిని పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక యువ సైంటిస్ట్ పాత్ర చేయాన్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటివరకు తన కెరీర్ లో చరణ్ ఇటువంటి పాత్ర చేయలేదనే చెప్పాలి. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ ని అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు శంకర్ సిద్ధం చేశారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలి అంటే మూవీ యూనిట్ నుండి అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: