తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి యూత్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరసలో ఉంటాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి సినిమాలలో చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ ‘పెళ్ళి చూపులు’ మూవీతో హీరోగా మారి అక్కడ నుండి వరస హిట్స్ కొడుతూ యూత్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.
ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడ ‘1 నేనొక్కడినే’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లాంటి సినిమాల్లో చిన్న పాత్రలలో నటించాడు. నటుడుగా అతడికి గుర్తింపు రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. రెండేళ్ల కిందట విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ ఇతడి కెరియర్ కు ఒక మలుపు తిప్పింది. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీతో నవీన్ పోలిశెట్టి పేరు యూత్ లో మారుమ్రోగిపోతోంది.
ఈ సినిమాలో అతడు చేసిన శ్రీకాంత్ పాత్ర గురించి ఆపాత్రకు సంబంధించి అతడి నటన గురించి యూత్ విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అతడికి యూత్ లో పెరిగిన మ్యానియాను పరిశీలిస్తే రానున్న రోజులలో ఈ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మ్యానియాకు కొంతవరకు చెక్ పెట్టే అవకాశం ఉంది అంటూ కొందరి సందేహం. ఇలాంటి పరిస్థితులలో త్వరలో విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ మూవీ ‘లైగర్’ విజయవంతం కాకపోతే విజయ్ మ్యానియాకు యూత్ లో కొంతవరకు చెక్ పడే అవకాశం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి