ఈ ఏడాది చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అయితే ప్రతి సినిమా హిట్ అవ్వలేదనే చెప్పాలి. కొన్ని యావరేజ్ గా ఆడితే కొన్ని సూపర్ హిట్ బ్లాక్ హిట్లు అయ్యాయి. ఇక "క్రాక్" సినిమాతో మాస్ మహారాజా, "మాస్టర్ " సినిమాతో విజయ్ "రెడ్ " సినిమాతో రామ్ ఈ ఏడాది మంచి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే ఈ ఏడాది ప్లాప్ హీరోలకి లాయర్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథలు మంచి హిట్స్ నే ఇచ్చాయి. ఒక్క నితిన్ "చెక్" సినిమా మినహాయించి మిగిలిన సినిమాలకి ఈ కాన్సెప్ట్ తో హిట్లు దక్కాయి. అందులో ముందు ముఖ్యంగా 8 ఏళ్ళుగా హిట్టు లేకుండా అల్లాడి పోయిన అల్లరి నరేష్ కు 'నాంది' రూపంలో మంచి హిట్ దొరికింది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ లాయర్ గా నటించింది.


ఆమె పాత్రే సినిమాకి హైలెట్ అని చెప్పాలి. ప్రత్యర్థులకు చమటలు పట్టించేలా ఆమె వాదించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇక అటు తరువాత 'జాతి రత్నాలు' లో హీరోయిన్ ఫరియా లాయర్ గా కనిపించింది.అయితే ఇది సీరియస్ రోల్ కాదు. కామెడీకి ఎక్కువ స్కోప్ ఉన్న రోల్. అయినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.అంతేకాకా ఈ ఏడాది అత్యధిక లాభాలు రాబట్టిన చిత్రంగా జాతి రత్నాలు రికార్డు కూడా సృష్టించింది.ఇక తాజాగా పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించిన 'వకీల్ సాబ్' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.మూడేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ కి మంచి కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది.ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లకి చేరువలో ఉంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: