తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం వరుసగా విజయాలతో గోల్డెన్ లెగ్ భామగా దూసుకెళ్తున్నారు పూజా హెగ్డే. తొలిసారిగా నాగచైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ సినిమాతో యావరేజ్ విజయం అందుకున్నప్పటికీ ఆడియన్స్ ని తన అందం, అభినయంతో ఎంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుంద సినిమాలో యాక్ట్ చేశారు పూజా. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే తో ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకున్న పూజా ఆపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అరవింద సమేత మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టి ఆ మూవీ ద్వారా భారీ సక్సెస్ అందుకొని తొలిసారిగా పెద్ద బ్రేక్ ను సొంతం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో వంశీపైడిపల్లి తెరకెక్కించిన మహర్షి లో హీరోయిన్ గా నటించిన పూజామూవీ ద్వారా కూడా మరొక విజయాన్ని అందుకున్నారు. దాని అనంతరం వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, అలానే అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాలా ద్వారా కూడా మరొక రెండు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు పూజా హెగ్డే. ఇక ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో రాధేశ్యామ్, అలానే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య సినిమాలు చేస్తున్నారు.

 

ఇక పూజా హెగ్డే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్ తో పంచుకునే అలవాటు గల పూజా హెగ్డే నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఆయన తనయుడు అభయ్ రామ్ తో కలిసి అరవింద సమేత మూవీ షూటింగ్ టైంలో దిగిన ఒక ఫోటోని పోస్ట్ చేశారు పూజా. ఇక పూజా హెగ్డే పెట్టే పోస్టులకు ప్రేక్షకాభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అలానే ఆమె ఒకింత సరదాగా పెట్టే పూజ పోస్టులకు ఫ్యాన్స్ కూడా సరదాగానే రిప్లై ఇస్తూ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం ఆమె ట్విట్టర్ లో 3.2 మిలియన్లు, ఇన్స్టాగ్రామ్ లో 13.6 మిలియన్లు, అలానే ఫేస్ బుక్ లో 8.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ విధంగా రోజురోజుకు తన క్రేజ్ అమాంతంగా పెంచుకుంటూ పోతున్న పూజా హెగ్డే, ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో రాబోయే రోజుల్లో ఏ స్థాయి విజయాలని అందుకుంటారో చూడాలి .... !!





మరింత సమాచారం తెలుసుకోండి: