సాధారణంగా శింబు ఎపుడూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తుంటాడు. హాట్ హాట్ కామెంట్స్ తో సినీ జనాలు చెవులు కొరుక్కునేలా చేస్తుంటాడు. కోలీవుడ్ ఆయనకు బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉంది. అందరూ వందకోట్ల క్లబ్ లో చేరితో ఆయన మాత్రం నూట ఒక్క కేజీల బరువు పెరడంతో.. అవకాశాలు ఒక్కొక్కటిగా దూరం అయ్యాయి.
శింబు బరువు పెరుగుతున్న కొద్దీ.. సినీ దర్శక, నిర్మాతలు ఆయన్ను పట్టించుకోవడమే మానేశారు. దీంతో ఆ హీరో చాాలా నిరుత్సాహానికి గురయ్యారు. కనీసం తన తండ్రి టి.రాజేందర్ ముఖం చూసయినా.. తనకు అవకాశాలు ఇవ్వడమే మానేశారని బాగా ఫీల్ అయిపోయాడు. తనను బానిసగా మార్చుకున్న ఆల్కహాల్ ను మానేందుకు డిసైడ్ అయిపోయాడు. అంతేకాదు బరువు తగ్గేందుకు ఆయన పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పలేం.
ఎపుడైతే ఆల్కహాల్ కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాడో.. అలాగే తన బాడీ స్ట్రక్చర్ కూడా మార్చే పనిలో పడ్డాడు. ఇప్పటి వరకు ఆల్కహాల్ కు బానిస అయిన శింబు ఇపుడు.. జిమ్ లో గడిపేస్తున్నాడు. మంచి ఫుడ్ తీసుకుంటూ కండలు పెంచేందుకు చెమటోడుస్తున్నాడు.
జిమ్ లో వర్కవుట్ చేయడంతో పాటు... ఆటలపై ప్రధానంగా దృష్టి పెట్టాడు శింబు. బాక్సింగ్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్ లు ఆడుతూ ఫిట్ నెస్ మెయింటైన్ చేసేందుకు కష్టపడుతున్నాడు. హెవీ వర్కవుట్స్ తో బరువు తగ్గించుకున్న శింబు.. కరోనా కాలంలోనూ ఇంట్లోనూ కసరత్తులు చేయడం మానలేదు. ఆ హీరో ఎపుడైతే మందు మానేసి.. వర్కవుట్స్.. సరైన డైట్ మెయింటైన్ చేస్తున్నాడో అప్పటి నుంచే బరువు తగ్గాడు. ఇపుడు ఆయన 101 కేజీల నుంచి 71కేజీలకు వచ్చేశాడు.
ఎలాకోలాగా మందు మానేసిన శింబు.. ఫంక్షన్ లకు వెళ్లినా డ్రింక్ సెక్షన్ వైపు అస్సలు చూడటం లేదు. ఇపుడు ఆయనకు సినిమాలు క్యూ కడుతున్నాయి. రెట్టింపు ఉత్సాహంతో ఊగిపోతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం మూడు సినిమాల షూటింగులలో బిజీబిజీగా గడిపేస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి