కొన్ని సార్లు సెలెబ్రెటీలు అభిమానులతో ముచ్చటించడానికి సోషల్ మీడియాలో వాళ్ళతో డైరెక్ట్ గా ఇంట్రాక్ట్ అవుతూ వుంటారు. ఆ టైములో వాళ్లడిగే అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్తుంటారు. ఇంకా కొంతమంది
నెటిజన్స్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ వుంటారు. ఇక కోపంతో ఊగిపోయిన సెలెబ్రెటీలు కొంతమంది కోపంతో రియాక్ట్ అయితే మరి కొంతమంది కూల్ గా వాళ్లకి గట్టి కౌంటర్లు ఇస్తుంటారు. ఇక ఇలాంటి ఇబ్బంది కర ప్రశ్న సౌత్
ఇండియా స్టార్
హీరోయిన్ నయనతార ప్రియుడు ప్రముఖ
డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి ఎదురయ్యింది.నయనతార విగ్నేష్ గత కొంత కాలంగా డేటింగ్ లో వున్న సంగతి తెలిసిందే. ఫారిన్ టూర్లు అని ఎక్కడి పడితే అక్కడ ఈ జంట షికార్లు చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక
కోలీవుడ్ లో ఈ జంట ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.ఇక నయన్ ప్రియుడు ఇంస్టాలో అభిమానులతో ముచ్చటించాడు. ఆ టైములో నెటిజన్ విగ్నేష్ ని ఓ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగాడు. దానికి విగ్నేష్ కోప్పడకుండా చాలా తెలివిగా ఆ నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
ఇంతకీ నెటిజన్ అడిగిన ఆ ప్రశ్న ఏంటంటే.. ఎప్పుడు మీరు నయన్ తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ వుంటారు. ఒక్కసారి నయన్ ని ముద్దుపెట్టుకుంటున్న ఫోటో షేర్ చెయ్యరా అని అడిగాడు. అందుకు విగ్నేష్ ఏమాత్రం కోప్పడకుండా ఆ నెటిజన్ కి సమాధానం ఇచ్చాడు. ఇంతకీ విగ్నేష్ ఏమని సమాధానం ఇచ్చాడంటే.. "నేను తనని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఖాళీగా లేను ఆమెకి ముద్దు పెడుతూ చాలా బిజీగా వున్నాను. ఆ టైములో అందుకే ఫోటో తీసుకోలేదు.ఎవరైనా ఫోటో తీసుంటే బాగుండు". అని నెటిజన్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు.ఇక నయన్ విగ్నేష్ దాదావు 6 సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక
పెళ్లి గురించి మాత్రం ఈ జంట ఇప్పటికీ కూడా నోరు విప్పటం లేదు.