ఇక కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పరిస్థితులు చాలా దారుణంగా అయిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇక ముఖ్యంగా సినిమా పరిశ్రమల పరిస్థితులు అయితే చాలా దారుణంగా అయ్యాయి. ఇక కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. దాని వల్ల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఎంతో నష్టపోయారు. అలాగే చాలా మంది సినీ కార్మికుల సైతం రోడ్డున పడ్డారు. ఇక థియేటర్లు మూత పడటంతో నిర్మాతలకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ దిక్కయ్యాయి.ఇక అప్పటిదాకా షూటింగ్ జరుపుకున్న సినిమాలు అన్ని కూడా ఓటీటిలో విడుదల అవుతూ వచ్చాయి. ఇప్పటికీ కూడా ఓటీటిలోనే సినిమాలు విడుదల అవుతున్నాయి.ఇక కొన్ని రోజులు థియేటర్లు ఓపెన్ చేసిన కాని మళ్ళీ కరోనా ఉధృతి పెరగడంతో మళ్ళీ లాక్ డౌన్ విధించడం జరిగింది.ఇక మళ్ళీ నిర్మాతలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ నే నమ్ముకోవాల్సిన పని వచ్చింది.ఇక తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌చాంబర్‌ ప్రతినిధులు అందరూ శనివారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చించుకోవడం జరిగింది. అందుకే ఈ నేపథ్యంలో నిర్మాతలు అందరూ కూడా తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంకి ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో... జూలై చివరినాటికి థియేటర్లు ఓపెన్ చేసుకునే అవకాశం ఉన్నందున అక్టోబర్‌ 30 వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని తెలపడం జరిగింది. ఇక తొందరపడి సినిమాలను అమ్ముకోవద్దని దిష్టి బ్యూటర్లు విజ్ఞప్తి చేశారు.ఇక ఈ సందర్భంగా... నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో ప్రదర్శించడం అంటే సినీమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడమేనని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడటం జరిగింది. తమ విజ్ఞప్తిని లెక్క చేయని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జూలై 7న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరపాలని నిర్ణయం తీసుకుంది. సినిమా పరిశ్రమ విస్తృత ప్రయోజనాల రీత్యా నిర్మాతలు సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott