ప్రస్తుతం జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ టీం లీడర్ గా ఉండగా రష్మీ యాంకర్ గా కొనసాగుతుంది. ఇక మరోవైపు ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ రియాలిటీ షోలో రష్మీ సుధీర్ ఇద్దరూ కూడా టీం లీడర్ గా కొనసాగుతున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య ఢీ షో లో కెమిస్ట్రీ అప్పుడప్పుడు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే విడుదలైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో అటు సుడిగాలి సుధీర్ రష్మి సంభాషణ ఎంతో హైలెట్గా నిలిచింది. ఇక స్టేజ్ మీద నిలబడి యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ కి ఫోన్ చేస్తుంది.
అటు వెంటనే ఫోన్ ఎత్తిన సుడిగాలి సుధీర్ రష్మీ ఏంటి అంటూ అడుగుతాడు.. ఇక అంతలో రష్మీ వయ్యారాలు తిరుగుతూ సుధీర్.. మా ఇంట్లో ఎవరూ లేరు అంటూ చెబుతుంది.. ఏంటి రష్మీ నాకు అర్థం కావడం లేదు మీ ఇంట్లో ఎవరూ లేకపోతే ఏంటి అని అడుగుతాడు సుధీర్.. యదవ సోది ఆపి మా ఇంట్లో ఎవరూ లేరు తొందరగా వచ్చేయ్ అంటూ చెబుతుంది రష్మి.. ఏంటి రష్మి ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావ్.. నన్ను వదిలేయ్ అంటూ పంచ్ వేస్తాడు సుడిగాలి సుదీర్. దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత టీమ్ లీడర్గా ఉన్న హైపర్ ఆది, దీపిక పిల్లి కూడా ఇలాంటి డైలాగుతోనే అలరిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి