క్రియేట్ సినిమాలకు పెట్టింది పేరు అయిన కృష్ణవంశీ చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణవంశీ సినిమాలు అన్ని క్రియేటివిటీ గా ఉంటాయి. 2002లో ప్రకాష్ రాజ్‌ - రవితేజ - శ్రీకాంత్ కాంబినేషన్లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. ఈ ముగ్గురు హీరోలను జ‌త‌ చేస్తూ ... దేశభక్తిని మేళవించి కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం ఎన్నో నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఖడ్గం సినిమాలో రవితేజ - సంగీత ఒక‌ జంటగా నటించారు. సంగీతను పిచ్చి పిచ్చిగా ప్రేమించే రవితేజ కనిపిస్తాడు. అయితే సంగీతను ఎలాగైనా సినిమా హీరోయిన్  ను చేయాలన్నా కోరికతో ఉన్న ఆమె తల్లి పావలా శ్యామల రవితేజను సంగీత నుంచి దూరం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

చివరకు సంగీత సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం దర్శకుడి పక్కలోకి కూడా ప‌డుకునే సీన్లో కనిపిస్తుంది. సంగీత కోసం వెళ్లిన రవితేజ సంగీత - దర్శకుడి పక్కలో ఉన్న దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడు అయిపోతాడు.. ఆ వెంట‌నే తీవ్ర మనోవేదన తో బాధపడతాడు. ఈ సీన్ అప్పట్లో సంచలనం రేపడం తో పాటు... సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కోసం హీరోయిన్లను దర్శకులు ఎలా ? వాడుకుంటారో కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఈ సీన్‌ను ఇండ‌స్ట్రీలో అప్పుడు ప్రతి ఒక్కరు ప్రశంసించారు.

అప్పట్లో టాలీవుడ్ టాప్ దర్శకుడిగా ఉన్న ఓ దర్శకుడిని టార్గెట్ గా చేసుకుని కృష్ణవంశీ ఈ బెడ్ రూమ్ సీన్ తీశారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అయితే కృష్ణవంశీ అగ్ర దర్శకుడి ని టార్గెట్ చేయడం వెనక రమ్యకృష్ణను ఆయన టార్చర్ చేశారని... ఈ విషయాన్ని రమ్యకృష్ణ కృష్ణవంశీతో షేర్ చేసుకోవడం తోనే ఆయన ఆ దర్శకుడి ని టార్గెట్ గా చేసుకుని ఈ బెడ్ రూమ్ సీన్ పెట్టారు అని కూడా ప్రచారం జరిగింది. మరి ఇందులో వాస్తవాలు ఏమిటో కృష్ణ వంశీ కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: