సాధారణంగా ఏ హీరో అయినా హిట్ కొట్టిన డైరెక్టర్ల వెంటే పడతారు. వాళ్లు ఇచ్చే అవకాశాలను చేజిక్కించుకొని కథకు న్యాయం చేసేందుకు ఆరాటపడతారు. అలాంది మెగా హీరోలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. దర్శకుల ప్రతిభను ఏ మాత్రం పట్టించుకోకుండా ఓకే చెప్పేస్తున్నారు. డైరెక్టర్ ఎన్ని ఫ్లాపులు చూసినా డోంట్ కేర్ అంటున్నారు.  

మెగా హీరోల్లో అగ్ర హీరో అయిన చిరంజీవి తమిళంలో బాక్సాఫీస్ దగ్గర బద్దలుకొట్టి కత్తి సినిమాను రీమేక్ చేశాడు. వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చేశాడు. అయితే అంతా బాగుంది కానీ.. వినాయక్ అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న సంగతినే మరిచిపోయాడు. గతంలో ఆయనిచ్చిన ఠాగూర్ ను గుర్తుకు తెచ్చుకొని వినాయక్ కు ఆ అవకాశం ఇచ్చాడు. ఫ్లాప్ డైరెక్టర్ ను కాస్తా మళ్లీ హిట్ బాట పట్టించాడు.

అంతేకాదు ఈ మెగా హీరో మరో ఫ్లాప్ డైరెక్టర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎవరో బాబీ.. వెంకీమామకు దర్శకత్వం వహించి.. ఫ్లాప్ చవిచూశాడు. కానీ బాబీ హార్డ్ వర్క్ కు చిరంజీవి ఆకర్షితులయ్యాడు. అందుకే బాబీకి అవకాశం ఇచ్చాడు చిరంజీవి. పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు షాడో సినిమాతో తీవ్ర నిరాశ చెందిన మెహర్ రమేశ్ అసలు కనిపించకుండా పోయాడు. అతన్ని వెతికి పట్టుకొని మరీ బంపర్ ఆఫర్ ఇచ్చాడు చిరంజీవి. తమిళ హిట్ చిత్రమైన వేదళం రీమేక్ చేస్తున్నాడు.

ఇండియన్ 2 సినిమా విషయంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నాడు దర్శకుడు శంకర్. అలా ఉన్నా కూడా.. ఆయనతోనే సినిమాకు రెడీ అయ్యాడు రామ్ చరణ్. మెగాపవర్ స్టార్ తో పాన్ ఇండియన్ మూవీలో తన టాలెంట్ చూపించి మళ్లీ గట్టెక్కాలని శంకర్ ఆరాటపడుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సాగర్.కె. చంద్రకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ దర్శకుడికి మళయాళీ హిట్ చిత్రమైన అయ్యప్పనుమ్ కోషియమ్ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు.







మరింత సమాచారం తెలుసుకోండి: