
ఎవరు ఏమి అన్నా అవేమి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయాలను ఎంతో ఆసక్తి కరంగా చిత్రీకరించాడు నాగ్ అశ్విన్. సావిత్రి సినిమాల్లోకి ఎలా వచ్చారని, సినిమాల్లోకి రావడానికి ప్రేరేపించే అంశాలు, సినిమాల్లోకి వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారు అనేదే సావిత్రి సినిమా. బంగారం లాంటి తన జీవితంలో మద్యానికి ఎందుకు బానిస కావాల్సి వచ్చింది. ఆమె జీవితంలో చోటు చేసుకున్న మంచి, చెడు రెండు సంఘటనలు చాలా అద్భుతం. మహానటి చివరిరోజుల్లో పడే బాధను చూసి ప్రతి ప్రేక్షకుడు చలించిపోతాడు. ప్రేమించిన వ్యక్తిని తన ప్రేమ కోసం దూరం చేసుకున్న విషయంలో ఆమె వ్యక్తిత్వం చాలా బలమైనది. ఎవరైనా నీ వల్ల కాదు అని అంటే ఆమె మొండి పట్టుదలతో తన వల్ల ఎందుకు కాదని చేసి చూపిస్తుంది సావిత్రి.
ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో సావిత్రి లాంటి గొప్ప నటీని మనం చూడలేమేమో అనిపిస్తుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎంతో ఒదిగిపోయారు. అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. సావిత్రి గారిని నిజంగానే తెరమీద చూస్తున్నామా అనుకునేంతగా సావిత్రి పాత్రలో ఒదిగిపోయారు కీర్తి సురేష్. ఆమె కాస్టూమ్స్, మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. ఆమె తప్ప మరెవ్వరూ ఈ సావిత్రి పాత్రకు న్యాయం చేయలేరేమోనని అనుకునేంతగా అద్భతంగా నటించింది. కేవలం హీరోలకే ఎక్కువ ప్రాధన్యత కలిగిన నేటి సినిమారంగంలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రితో పాటు మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రలో సమంత కూడా అద్భుతంగా నటించింది. మరో నటి షాలినిపాండే తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. భావితరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం తరతరాలు గర్వించే సావిత్రి కథ మహానటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్అశ్విన్ ను అభినందించాలి.