మొన్నటివరకు టాస్కులతో ఎంతో వాడివేడిగా మారిపోయిన బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం సందడి సందడి గా మారిపోయింది.ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎనిమిది మందికంటెస్టెంట్ లకు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక  హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉన్నారు. అయితే ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఎలా ఆడాలి అని కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం.


 ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినా సిరి తల్లి మాత్రం రావడం రావడమే షాకిచ్చింది అన్న విషయం తెలిసిందే. నువ్వు ఎంతో బాగా గేమ్ ఆడుతున్నావ్ కానీషణ్ముఖ్ జస్వంత్ ను హగ్  చేసుకోవడం నాకు నచ్చడం లేదు. అతను నీకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు.. కానీ ఊరికే హాగ్ చేసుకోవడం మాత్రం అస్సలు నచ్చడంలేదు అంటూ అందరి ముందు చెప్పి షాకిచ్చింది తల్లి.   దీంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ సిరి పక్కకు తీసుకెళ్ళి ఎందుకు అలా అన్నావ్ ముఖం మీద అంటే ఫీల్ అవుతారు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక తల్లిగా చెప్పాల్సిన బాధ్యత తనకు ఉంది  అంటూ సిరి తల్లి జవాబు ఇచ్చింది.


 ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పటిలాగానే తిరిగి వచ్చి షణ్ముఖ్ ను హాగ్ చేసుకుని ఏడ్చింది సిరి. కానీ షణ్ముక్  మాత్రం మనసారా సిరిని దగ్గరికి తీసుకొని ఓదార్చలేక పోయాడు. అయితే సిరి కోసం ఎంతో సపోర్ట్ చేస్తే చివరికి ఆమె తల్లి తో మాట పడాల్సి వచ్చిందని ఒంటరిగా కూర్చుని ఎంతగానో ఫీల్ అయ్యాడు షణ్ముఖ్. హగ్గులు నచ్చలేదని సిరి తల్లి అన్నప్పుడు సిరి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ ఒంటరిగా కూర్చుని ఎంతో బోరున విలపించాడు. హౌస్ లో ఉండేందుకు తనకు అర్హత లేదని.. ఇంకా ఎందుకు హౌస్లో కొనసాగుతున్నాను తనకే అర్థం కావట్లేదు అంటూ ఎంతగానో కుమిలిపోయాడు షణ్ముఖ్ జస్వంత్..

మరింత సమాచారం తెలుసుకోండి: