బిగ్ బాస్ షో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్శించి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ఇక బిగ్బాస్ వంద రోజులకు చేరువా అవుతూ ఉండడంతో బిగ్ బాస్ లో ఆట రోజురోజుకు రసవత్తరం గా మారిపోతుంది. ఈ క్రమంలోనే తమ అభిమాన కంటెస్టెంట్ సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఓట్లు వేసి మద్దతు ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే బిగ్బాస్ ఐదవ సీజన్ మొదలైనప్పటి నుంచే కొన్నాళ్లపాటు స్నేహితులుగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు సిరి షణ్ముక్ ఇద్దరు. కానీ ఆ తర్వాత మాత్రం వీరిద్దరి ఫ్రెండ్షిప్ బుల్లితెర ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించింది అని చెప్పాలి.


 చిన్న చిన్న విషయాలకే ఒకరితో ఒకరు హగ్గులు, కిస్సులతో  రెచ్చిపోయారు. దీంతో వీరిద్దరూ పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్న వీరి మధ్య బంధం రోజురోజుకీ బలపడుతోంది అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. వారంలో బిగ్ బాస్ తో మాట్లాడిన సిరి షణ్ముఖ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నానని అది తప్పు అని తెలిసినప్పటికీ నేను కంట్రోల్ చేసుకో లేక పోతున్నాను అంటూ స్వయంగా ఒప్పుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది  అయితే వీరిద్దరు ఇప్పటికే వేరే వాళ్ళతో ప్రేమలో ఉండటం గమనార్హం.  వీరిద్దరు ఫ్రెండ్షిప్ కాస్త అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.. అంతే కాదు షణ్ముఖ ఏదైనా గొడవ జరిగింది అంటే చాలు తనని తాను గాయపరచుకుంటుంది సిరి.


 ఇక ఇటీవల ఏకంగా సిరి తల్లి హౌస్ లోకి వచ్చి షణ్ముఖ్ కి హగ్గు ఇవ్వడం అస్సలు నచ్చలేదు అంటూ అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే హౌస్లో వీరిద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ గా కొనసాగిన జెస్సి ఇటీవలే బయటకి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒక మీడియా  ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్న వాళ్లతోనే క్లోజ్గా ఉంటారు అని.. కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం అది కంటిన్యూ అవ్వదు అంటూ అభిప్రాయం  వ్యక్తం చేశాడు. అయితే షన్ను కోసం సిరి తలను గోడకేసి కొట్టు కోవడం ఏమాత్రం నచ్చలేదు అని.. తాను అక్కడ ఉండి ఉంటే సిరీ చెంప పగలగొట్టే వాడిని అంటూ జెస్సి కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: