ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీకి కేరాఫ్ అడ్రస్గా ఎంతోమందికి కడుపుబ్బ నవ్వించిన హాస్యనటుడుగా.. హాస్యబ్రహ్మ గా కొనసాగుతున్నారు బ్రహ్మానందం. ఎన్నో దశాబ్దాల నుంచి హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమేడియన్గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే వుంటారు. సాధారణంగా ఇతర కమెడియన్స్ అయితే నవ్వించడానికి కామెడీ చేయాల్సి ఉంటుంది. కానీ బ్రహ్మానందం మాత్రం తెరమీద కనిపిస్తే చాలు ఇక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలా తెలుగు ప్రేక్షకులందరిని కూడా కడుపుబ్బ నవ్వించి ఏకంగా అందరి మనసులు గెలుచుకున్నారు బ్రహ్మానందం  అయితే ఇటీవలే కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం తన జీవిత విశేషాలను పంచుకుని ఎంతగానో ప్రేక్షకులను అలరించారు. ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలీ గెస్ట్ గా వచ్చిన బ్రహ్మానందం మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉండడంతో ఇక వీరి మధ్య సంభాషణలు కూడా ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వు తెప్పించాయ్ అని చెప్పారలి.


 అయితే ఇటీవలే ఆలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందంతో ఒక ఎపిసోడ్ పూర్తయింది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఇక బ్రహ్మానందం తో ఏకంగా రెండు ఎపిసోడ్లను ప్లాన్ చేశారు. ఇక ఇటీవలే బ్రహ్మానందం ఎపిసోడ్ పార్ట్ 2 కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమోలో భాగంగా అలీ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఆసక్తిగా సమాధానాలు చెప్పారు బ్రహ్మానందం. ఇక చివర్లో మీరు గత కొంత కాలం నుంచి ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అని ప్రశ్నించగా ఏకంగా తన కళ్ళ జోడు నేలకేసి కొట్టి చివరికి ఇక షో నుంచి వెళ్లిపోయారు బ్రహ్మానందం.  దీంతో అలీ షాక్ అయ్యారు. బ్రహ్మానందం ఎందుకలా చేశారు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: