గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ కపుల్ విడిపోతుందని మీడియా అంతా కోడై కూసింది. కానీ ఎవరన్న విషయంపై మాత్రం నిన్నటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఇపుడు స్పష్టం కాగా ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు ధనుష్. త్రీ, నవమన్మధుడు, మారి, రఘువరన్ బీటెక్ వంటి పలు తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేయగా ధనుష్ కి ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇతడు చేసిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ డబ్ అవుతుంది అంటే ధనుష్ కి తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాగా ఈ హీరో కి 2004 లో అగ్ర హీరో రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సౌత్ లో ది బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ టాప్ లిస్ట్ లో వీరి జంట కూడా ఒకటి. అయితే 18  సంవత్సరాల పాటు సవ్యంగా జరిగిన కాపురంలో ఇపుడు కలతలు, కలహాలు పెరగడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు హీరో ధనుష్ మరియు ఆయన భార్య  ఐశ్వర్య. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇరువురు ప్రకటించారు.

అయితే వీరి విడాకులకు కారణం ఇవేనంటూ కొన్ని కారణాలు వినపడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చి ఎంత రసాభాస జరిగిందో తెలిసిందే. అప్పుడే వీరి మధ్య పెద్ద గొడవ జరిగి దూరం పెరిగిందని వార్తలు వినిపించాయి. అయితే మళ్ళీ మామగారి జోక్యంతో సర్దుకుని ఒకటిగా కనిపిస్తూ వచ్చారు. అయితే ఇపుడు మరో సారి ధనుష్ కి ఐశ్వర్య కి మద్య మరి కొన్ని మనస్పర్థలు తలెత్తడంతో ఇక చేసేది ఏమీ లేక విడిపోవడమే మంచిదని ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చారు. నిజంగా ఇది ధనుష్ అభిమానులకు మింగుడుపడని విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: