ఒకప్పుడు హీరో, హీరోయిన్స్ అంటే కేవలం నటనకే పరిమితం అయి ఉండేవారు. అందులో కేవలం కొద్ది మందికి మాత్రమే నిర్మాణం, దర్శకత్వం వైపు మొగ్గు చూపేవారు.. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న హీరో హీరోయిన్లు తమకు దక్కిన స్టార్ డమ్ ను బాగా ఉపయోగించుకుని రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక అందుచేతనే ఎంతో మంది హీరోలు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు..ఇక అలాంటి బ్రాండ్ ను ఉపయోగించుకొని.. వారు బిజినెస్ రంగం లోకి అడుగుపెట్టారు. అలా ఎంతో మంది హీరోయిన్స్ కూడా వీరి బాటలోనే నడుస్తున్నారు..

అలాంటి వాటిలో ముందు వరుసలో ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అని చెప్పవచ్చు. ఎందుచేతనంటే ఈమె పలు రంగాలలో తన గ్లామర్ ను, తనకున్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మంచి వ్యాపారాలను చేస్తూ ఉంది.. ముఖ్యంగా రకుల్ నిర్వహిస్తున్నటువంటి జిమ్ బిజినెస్ కు మంచి విశేష స్పందన లభించిందట. ఇక అందుకు తన సోదరుడు కూడా ఆమెకు బిజినెస్ లో సహాయం పడుతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పుడు తాజాగా మరొక కొత్త బిజినెస్ వైపు మొగ్గు చూపుతోంది ఈ ముద్దుగుమ్మ.. అదేమిటంటే "యూ" అనే ఒక వెబ్ సైట్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం. ఎవరైనా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూసే వారికి మధ్యవర్తిగా ఉంటుంది ఈ సైట్.

అందుకోసం రకుల్ కొన్ని నిర్మాణ సంస్థలు, కొంతమంది ప్రముఖుల తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైనా సరే నటనపరంగా, సాంకేతిక నిపుణుల పరంగా సినిమాలలో పనిచేయాలనుకునే వారికి ఈ వెబ్సైట్ ద్వారా తమ పేరును నమోదు చేసుకుంటే.. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు.. ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారట. ఈ ఐడియాతో ఆమెకు లాభాలను తెచ్చి పెట్టడమే కాకుండా.. కొంతమందిని ప్రోత్సహించడానికి మంచి అవకాశం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: