కానీ అంతలో కరోనా వైరస్ కాలు అడ్డు పెట్టినంత పని చేసింది. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడవడం మొదలయ్యాయి. దీంతో మొదట త్రిబుల్ ఆర్ తర్వాత రాధేశ్యామ్ కూడా విడుదల కూడా వాయిదా వేసారూ. ఇక ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో అన్న దానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇకపోతే ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేస్తాం అంటూ ప్రకటించింది చిత్ర బృందం. హామ్మయ్య ఇప్పటికి రిలీజ్ డేట్ వచ్చింది.. ఇక రాధేశ్యాం పరిస్థితి ఏంటో అంటూ అందరూ అనుకుంటున్న సమయంలో త్రిబుల్ ఆర్ కంటే ముందే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది రాధేశ్యామ్.
మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము అంటూ ఇటీవల అఫీషియల్ ప్రకటన చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా కోసం నిరీక్షణ ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత రాధేశ్యామ్ విడుదలవుతుందని కొంత మంది అనుకున్నారు. కానీ డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ముందుగానే మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. వెంట వెంటనే విడుదల అవుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో ఏదీ సక్సెస్ అవుతుందనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి