ఆ విధంగా తన తొలి సినిమా నుంచి దర్శకుడు త్రివిక్రమ్ ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ఆయన తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఉండడం అనేది ఆయనకు అలవాటు. అయితే ఆయన చిత్ర టైటిల్ విషయంలో ఓ సెంటిమెంటును చాలాసార్లు పాటించాడు. అలా ఆయన సెంటిమెంటును ఫాలో చేసి హిట్ల మీద హిట్ లు రాగా చిత్రానికి అ అనే అక్షరం మీదుగా వచ్చే టైటిల్ ను పెడితే ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యే అలా కాకుండా ఇతర అక్షరాలతో మొదలయ్యే టైటిల్స్ పెడితే అవి ఆయనకు భారీ ఫ్లాపులు తీసుకువచ్చేది.
తాజాగా మహేష్ బాబు సినిమాకి కూడా ఆయన ఇదే విధమైన సెంటిమెంటు కొనసాగించనున్నాడని తెలుస్తుంది. వరుసగా అ పేరు తో మొదలయ్యే సినిమా పేర్లు పెట్టుకుంటూ వచ్చి హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ తో అ అక్షరం తో మొదలయ్యే పేరును టైటిల్ గా నిర్వహించి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కు ఈ సెంటిమెంట్ మరొకసారి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. దర్శకత్వం వహించిన గత సినిమా అల వైకుంఠ పురం లో భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుంది ఇప్పుడు ఈ చిత్రం ఎంతటి స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి