టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మల్టీ స్టారర్ మూవీ "రణం రౌద్రం రుదిరం" మూవీ కోసం ఒక్క తెలుగు ప్రజలే కాదు యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ అదేనట అనుకుంటూ వాయిదా పడటంతో వాపోయిన ఆడియన్స్ ఈ విషయంలో చాలా ఫీల్ అయ్యారు. తమ అభిమాన తారల సినిమా చూసే సమయం వచ్చేసింది అనుకుని హంగామా చేసేలోపు రిలీజ్ వాయిదా పడింది అన్న వార్తలు తెలియడం దాంతో అభిమానులు ఉసూరుమంటూ వాపోవడం జరిగింది. అయితే ఈ సారి రిలీజ్ కు ముందే అనగా సినిమా ప్రమోషన్స్ సమయంలో అభిమానుల కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ను ప్లాన్ చేశారట.

తమ అభివృద్ధికి మూల కారణం అయిన ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి, అదే విధంగా సినిమా అంచనాలు మరో మారు అలా పెంచేయడానికి రెండింటికీ కలిసొస్తుందని అనుకుంటున్నారట జక్కన్న. ఇంతకీ అదేమిటంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్ సమయంలో ఇప్పటి వరకు రివీల్ చేయని సినిమాలోనూ ఓ పవర్ఫుల్ గ్లిమ్ప్స్ ను త్వరలో హైద్రాబాద్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ప్లే చేయబోతున్నట్లు సమాచారం. అదికూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బడా స్టార్ అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అని తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఇపుడు మరో వార్త ప్రచారం అవుతోంది.

ఈ సారి ప్రమోషన్స్ లో ఆలియా భట్ ఉండరని అంటున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఆమె ప్రమోషన్స్ కు హజరుకలేకపోతున్నారు అని చెబుతున్నారు. కాగా ఈ సారైనా అనుకున్న రిలీజ్ డేట్ మార్చి 25 న సినిమా రావాలని ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: