తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ ఒకప్పుడు హీరోయిన్గా దర్శకురాలిగా  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జీవిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ బాలీవుడ్లో ప్రస్తుతం ఎవర్గ్రీన్ జంటగా కొనసాగుతూ ఉన్నారు. జీవిత రాజశేఖర్ ఎక్కడ కనిపించినా ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు.  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అయితే జీవిత రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా శేఖర్ అనే సినిమా తెరకెక్కింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జీవితా రాజశేఖర్ సహా ఫ్యామిలీ మొత్తం ఇటీవల కాలంలో బుల్లితెరపై ఏ కార్యక్రమంలో చూసిన సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈటీవీలో ఉగాది స్పెషల్ గా ప్లాన్ చేసిన అంగరంగ వైభవంగా ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ తాను హోస్టింగ్ చేసే బతుకు జట్కా బండి కాన్సెప్ట్ను ఇక అంగరంగ వైభవంగా అనే కార్యక్రమం చేశారు.



 ఇక ఈ సందర్భంగా మొన్నటికి మొన్న ప్రోమోలో హైపర్ ఆది చెంప పగులగొట్టిన రోజా ఒకవైపు ఇక హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ మరో వైపు కూర్చున్నారు.. అందరికీ న్యాయం చెప్పే స్థానంలో జీవిత కూర్చుంది. అదే సమయంలో ఇక బుల్లెట్ భాస్కర్ పక్కనే కూర్చున్నాడు హీరో రాజశేఖర్. ఈ క్రమంలోనే ఇక  అందరి మధ్య ఎంతో ఫన్నీ  కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా రోజా ఎంతో సీరియస్గా హైపర్ ఆది మీదికి వస్తూ ఉంటుంది. వాళ్ళు మనమీద అంతలా రెచ్చిపోతున్నారు మీరు మాట్లాడారా సార్ అని హైపర్ ఆది అడుగుతాడు. ఇంతలో కల్పించుకున్న రాజశేఖర్ శేఖర్ సినిమా తప్పకుండా చూడాలి అంటూ చెబుతాడు. తర్వాత ఏంటి సర్ ఓకేలా చెబుతున్నారు మీరేం మాట్లాడరా అంటూ అడుగగా నా జీవితం మొత్తం బతుకుజట్కబండి లో అయిపోయింది ఇంకేం మాట్లాడుతాను అంటూ పంచ్ వేస్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: