యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తన కెరియర్ లో ప్లాప్ లలో ఉన్న ఎంతో మంది దర్శకులకు అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా ఎన్టీఆర్ ప్లాప్ లలో ఉన్న దర్శకులకు అవకాశాలు ఇచ్చే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

టెంపర్ : ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా కంటే ముందు పూరి జగన్నాథ్ బాక్సాఫీస్ దగ్గర వరస పరాజయాలతో డీలా పడిపోయాడు. టెంపర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.


నాన్నకు ప్రేమతో : ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు.  నాన్నకు ప్రేమతో సినిమా కంటే ముందు సుకుమార్ 1 నేనొక్కడినే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది.  ఆ తర్వాత ఎన్టీఆర్ తో తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో సినిమా మంచి విజయం అందుకోవడంతో సుకుమార్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.


అరవింద సమేత : ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.  అరవింద సమేత సినిమా కంటే ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అజ్ఞాతవాసి' సినిమాతో బాక్సాఫీసు దగ్గర ప్లాప్ ను ఎదుర్కొన్నాడు. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో తెరకెక్కించిన అరవింద సమేత సినిమా మంచి విజయం సాధించడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.


ఇలా ఎన్టీఆర్ కొంత మంది ప్లాప్ లతో ఉన్న దర్శకులకు అవకాశాలు ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: