సినీ నిర్మాత ,డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారాయణ కుమార్తె.. జాన్వి నారంగ్ వివాహ మహోత్సవం ఫిలిమ్ నగర్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఈమె దిగంత నారాయణదాసు కే. నారంగ్ మనవరాలు కావడం గమనార్హం. సినీ ఇండస్ట్రీ లోనే అత్యంత ఖరీదైన వేడుకగా జరిగింది.. ఇక వరుడు ఆదిత్యతో కలిసి జాన్వి ఏడడుగులు వేసింది హైదరాబాదులో హైటెక్ లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఇక జాన్వి, ఆదిత్య జంటను ఆశీర్వదించేందుకు ఇండస్ట్రీ నుంచి ప్రముకులు సైతం హాజరయ్యారు ఈ పెళ్లి వేడుకలో మెగా బ్రదర్స్ ఇద్దరు ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. ఇక వీరితో పాటే నాగార్జున గోపీచంద్, శివకార్తికేయన్, నాగచైతన్య తదితర హీరోలు కూడా అటెండ్ అయ్యారు దర్శకులలో శేఖర్ కమ్ముల త్రివిక్రమ్ ,ప్రశాంత్ వర్మ కనిపించారు. ఏషియన్ సినిమాస్ అధినేతలతో భాగస్వామ్యైన దగ్గుబాటి సురేష్ కూడా ఈ వేదికకు హాజరు కావడం జరిగింది అయితే వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిన్నటి రోజున జరిగిన ఈ వివాహానికి నాగార్జున నాగచైతన్య ఫోటోలు తీయడానికి అక్కడున్న ఫోటోగ్రాఫర్లు సైతం పోటీపడ్డారు.ఇక ఇంత మంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరు అవ్వడం తో అక్కడ మరింత ప్రేక్షకులకు ఉత్సాహం నెలకొంది అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ తో వివాహానికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగానే వైట్ డ్రెస్సులు అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో 24 శాఖల నుంచి ప్రేమికులంతా ఈ వివాహానికి హాజరయ్యారు టాలీవుడ్ లోనే అత్యంత కాస్ట్లీ వెడ్డింగ్ ఇదే అని సమాచారం. హైదరాబాద్ హైటెక్ లో జరిగిన ఈ పెళ్లి కోసం నారాయణ్ కుటుంబీకులు కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఇప్పుడు ఈ వివాహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: