డాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, నటుడిగా రాఘవ లారెన్స్ కు తెలుగు మరియు తమిళ భాషలలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ అనేక సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ముని , కాంచన , గంగ , శివలింగ వంటి హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీలతో రాఘవ లారెన్స్ కు మంచి గుర్తింపు లభించింది.

అలాగే ఈ సినిమాలు తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఇది ఇలా ఉంటే కాంచన 3 మూవీ తర్వాత రాఘవ లారెన్స్ నటించిన ఏ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది ఇలా ఉంటే కాంచన 3 మూవీ తర్వాత సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. రాఘవ లారెన్స్ ప్రస్తుతం రుద్రన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కథిరేసన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తుండగా , ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ వారి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ లో రాఘవ లారెన్స్ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్ నటిస్తోంది. 

తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ ని 23 డిసెంబర్ 2022 న  ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. ఈ సినిమాతో పాటు రాఘవ లారెన్స్ పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే చంద్రముఖి 2 సినిమాలో కూడా నటించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుస పెట్టి రెండు సినిమాలతో రాఘవ లారెన్స్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: