అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఇదివరకే సోషల్ మీడియాలో కూడా రికార్డులను సైతం సృష్టించాయి. ఇప్పుడు ఈ సినిమా ఆల్బమ్ పరంగా మరొక సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది ఇండియాలోని అత్యధికంగా వ్యూస్ ను అందుకున్న బెస్ట్ యూట్యూబ్ ఆల్బమ్గా ఈ చిత్రంలోని సాంగ్స్ నిలవడం గమనార్హం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు అందించారు. సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కలయికలో ఇదివరకే పలు సినిమాలు వచ్చాయి. ఒకేసారి ఈ చిత్రం అన్ని భాషలలో విడుదలవ్వడం చేత పుష్ప సినిమా ఆల్బమ్ 5 బిలియన్ యూట్యూబ్ వ్యూస్ సంపాదించడం విశేషం.
ఇదివరకే అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమా ఆల్బమ్ కూడా భారీ స్థాయిలోనే రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమాకి అన్ని పాటలు థమన్ అందించారు ఇక ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ద్వారా అల్లు అర్జున్ మరొక బెస్ట్ ఆల్బమ్ అందుకోవడం గమనార్హం. పుష్ప సినిమా సెకండ్ పార్ట్ కోసం దేవి ప్రసాద్ మరొకసారి అదిరిపోయే విధంగా ట్యూన్ కంపోజ్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ రెండవ పార్ట్ ఆల్బమ్ కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి