వైజయంతీ మూవీస్ సమర్ఫణలో టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సీతా రామం'.మలయాళం స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 13 రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..కేరళ, తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం తెలుస్తుంది.మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా యూఎస్‌లో ఏకంగా 1 మిలియన్ డాలర్ వసూళ్లు చేసింది.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్ట్‌నెంట్ రామ్ పాత్రలో జీవించాడు.ఇక సీతా రామంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ నటిచింది. హాట్ బ్యూటీ రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించింది. టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ ఇంకో ప్రధాన పాత్రలో నటించారు.ఇక దుల్కర్ సల్మాన్ ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు.


దుల్కర్..ఇక తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్‌ పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన సంపాదించుకున్నారు. ఈయన హీరోగా విడుదలైన ఈ సీతారామం సినిమా విమర్శకులు ప్రశంసలు దక్కించుకోని దుల్కర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకపోవడంతో పాటు కుటుంబ సమేతంగా చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ లవ్ స్టొరీ సీతా రామం బ్రేక్ ఈవెన్‌ని కూడా పూర్తీ చేసుకుని అదరగొట్టింది. ఇక ఈ సినిమా 13 రోజు కూడా ఏకంగా రూ. 0.93 కోట్ల షేర్ (రూ. 2.00 కోట్ల గ్రాస్) వసూళ్లను వసూళ్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: