టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్స్ ఉన్న ఫ్యామిలీ అంటే అది మెగా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఆ ఫ్యామిలీలో వచ్చే ప్రతి హీరోని ఆదరిస్తూ మెగా ఫ్యాన్స్ తమ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే హీరోలు ఎంతమంది ఉన్నా సరే మెగా ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చేది ముగ్గురు పేర్లే అది ఒకరు మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా పవర్ స్టార్ రాం చరణ్. చిరంజీవి, రాం చరణ్ ఇద్దరు మెగా హీరోల కిందకు వస్తే పవర్ స్టార్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది.

అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ముగ్గురికి ఒకే రకమైన అభిమానం చూపిస్తారు. ఇక లేటెస్ట్ గా ముగ్గురిని కలిపి ఓ ఫ్యాన్ మేడ్ ఫోటో సిద్ధం చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ గా పవన్.. బాస్ ఆఫ్ మాసెస్ గా చిరుని.. మాన్ ఆఫ్ మాసెస్ గా చరణ్ ఫోటోని ఉంచి పోస్టర్ రెడీ చేశారు. ఈ పోస్టర్ లో ముగ్గురు మాస్ లుక్ తో బ్లాల్ షర్ట్ తో కనిపిస్తున్నారు. పవన్ ది భీంలా నాయక్ పోస్టర్.. చిరుది గాడ్ ఫాదర్ పోస్టర్ తో కవర్ చేయగా.. రంగస్థలం లోని రాం చరణ్ ఫోటో తో ఈ పోస్టర్ డిజైన్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. మెగా హీరోలు ముగ్గురు ఒకే పోస్టర్ పై కనిపిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. జస్ట్ పోస్టర్ కే ఈ రేంజ్ రచ్చ ఉంటే.. ఒకవేళ ఈ ముగ్గురు కలిసి నటిస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంచనా వేయడమే కష్టం. అయితే ఆచార్య ఇచ్చిన షాక్ వల్ల మెగా మల్టీస్టారర్ అంటే ఫ్యాన్స్ భయపడుతున్నారు. తప్పకుండా ఈసారి మంచి కథతో వీరి మల్టీస్టారర్ చేస్తారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: