ఈటీవీలో ప్రసారం అవుతున్న టాప్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎందరో కమెడీయన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.ఒకప్పుడు బాగున్న ఈ షో ఇప్పుడు బూతులకు కెరాఫ్ గా మారింది.ఇకపోతే తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.యాంకర్ అనసూయ శ్రీలంకలో మెరిసింది.దాని గురించి జబర్దస్త్ కమెడీయన్ శ్రీసత్య బయట పెట్టింది. శ్రీ సత్యకు మంచి పేరు వచ్చింది. అయితే ఆమె కేవలం చమ్మక్ చంద్ర టీంలోనే కనిపించేది. చమ్మక్ చంద్ర భార్యగానే ఎక్కువగా నటించేది..

చమ్మక్ చంద్ర అదిరింది, బొమ్మ అదిరింది షోలో చేశాడు. అక్కడా అతనితో పాటు కలిసి స్కిట్లు వేసింది. ఇక కామెడీ స్టార్స్ షోలోనూ చమ్మక్ చంద్రతో కలిసి అందరినీ నవ్వించే ప్రయత్నం చేసింది. చమ్మక్ చంద్ర తన గురువు అని, తన గురువు వెళ్లడంతోనే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానంటూ సత్య శ్రీ చెబుతూ ఉంటుంది.అయితే శ్రీ సత్య ఇప్పుడు స్పెషల్ ఈవెంట్లు, షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది. సినిమాల్లోనూ సత్య ట్రై చేస్తోన్నట్టుంది. ఇక సత్య ఫోటో షూట్లు, నెట్టింట్లో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో మొదటి సారిగా తాను హోస్ట్ చేసిన షో గురించి చెప్పింది. శ్రీలంకలో ఓ ఈవెంట్ జరిగిందట. తాను మొదటి సారిగా ఆ షోను హోస్ట్ చేసిందట. ఈ ఈవెంట్‌లో అనసూయ మెరిసిందని చెప్పుకొచ్చింది. ఇక అనసూయతో కలిసి దిగిన ఫోటోలను శ్రీ సత్య షేర్ చేసింది.ఈవెంట్‌లో అనసూయ తన భర్త సుశాంక్‌తో పాటుగా కనిపించింది. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో కండక్టర్ ఝాన్సీ కూడా కనిపిస్తోంది. మళ్లీ అదే పల్సర్ బైక్ స్టెప్పులు, అదే క్యాస్టూమ్‌తో కనిపిస్తోంది. ఇక శ్రీలంకలోనూ ఝాన్సీ అవే స్టెప్పులు వేసినట్టుంది. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ సత్య, అనసూయ ఇలా ఇద్దరూ చీరకట్టులో ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించారు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: