బ్రహ్మోత్సవం' వంటి డిజాస్టర్ తర్వాత మహేష్ బాబు .. మురుగదాస్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో.. 'అందరూ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు మహేష్' అని అనుకున్నారట..కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. 'స్పైడర్' కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకి ఏకంగా రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టించాడు మురుగదాస్. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాడు. ఎస్.జె.సూర్య ఈ మూవీలో విలన్ గా నటించగా అతని పాత్రకు ప్రశంశలు దక్కాయి.


నిజానికి ఈ పాత్రను కాస్త గడ్డం పెంచేలా చేసి మహేష్ తోనే చేయించాలి అని మురుగదాస్ అనుకున్నాడట. ఆ రకంగా మహేష్ తో గడ్డం పెంచమనడం కూడా జరిగింది. ఆ లుక్ ఎక్కడా లీక్ అవ్వకుండా ఆ టైంలో మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ లుక్ టెస్ట్ చేసినప్పుడు మహేష్ ఆ పాత్రకి సూట్ అవ్వడు అని భావించి మురుగదాస్ లైట్ తీసుకున్నాడట. దీంతో ఆ పాత్రకు ఎస్.జె.సూర్య ని తీసుకున్నాడట మురుగదాస్.


 


ఇక హీరోయిన్ గా రకుల్ ను ఫైనల్ చేశారు కానీ అంతకు ముందు బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాని అనుకున్నారు. ఆమెకు ఓ తెలుగు ట్రైనర్ ను పెట్టి.. తెలుగు కూడా చాలా రోజులు నేర్పించారు. కానీ ఫైనల్ గా లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆమె కూడా మ్యాచ్ కూడా అవ్వలేదు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ను ఫైనల్ చేశారు దర్శకనిర్మాతలు. ఆ రకంగా స్పైడర్ వంటి ప్లాప్ మూవీ నుండి పరిణితి చోప్రా తప్పించుకుంది. రకుల్ మాత్రం బుక్కైపోయింది.


 


అయినప్పటికీ ఈ మూవీ కోసం రకుల్ కోటి పైనే పారితోషికం అందుకుంది. ఈరోజుతో స్పైడర్ సినిమా రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తికావస్తోంది.2017 సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి మహేష్ అభిమానులే ఫన్నీ మీమ్స్ చేస్తూ ఈ చిత్రం హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి: