ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్లకే స్టార్ గా కొనసాగుతున్న మెగాస్టార్ ఎవరికైనా ఒక మాట ఇచ్చాడు అంటే ఇక దానికి తిరుగు ఉండదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇప్పుడు వరకు ఎంతోమందికి ఎన్నో రకాల మాట ఇచ్చింది నిలబెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఇక ఇప్పుడు మరోసారి తాను ఇచ్చిన మాటకు కట్టుబడే మనిషినీ అన్న విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు అని చెప్పాలి.  అప్పుడెప్పుడో బిగ్ బాస్ గెస్ట్ గా వచ్చిన సమయంలో మెగాస్టార్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి మాట ఇచ్చారు. ఎప్పుడు సరదాగా అందరితో మాట్లాడే మెగాస్టార్ అందాల భామ దివి తో కూడా ఎంతో సరదాగా ముచ్చటించారు.


 తన సినిమాలో దివికి తప్పక ఛాన్స్ ఇస్తాను అంటూ అప్పట్లో మెగాస్టార్ మాట ఇవ్వడం కాస్త అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. అయితే మెగాస్టార్ సరదాగా ఇలా మాట్లాడి ఉంటారులే ఆయన సినిమాలో ఛాన్స్ రావడం అంటే అది మామూలు విషయమా అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడెప్పుడో దివికి ఇచ్చిన మాటను ఇక ఇప్పుడు నిలబెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతోమంది అటు మెగాస్టార్ చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నారూ అని చెప్పాలీ.


 ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రిమేక్ గాడ్ ఫాదర్ అనే సినిమా పేరుతో తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే  ఇక ఈ సినిమాలు బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి కోసం ఒక మంచి క్యారెక్టర్ ప్రిఫర్ చేశారట మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయం గురించి అటు చిరంజీవి ఎక్కడ బయట చెప్పుకోలేదు. కానీ  ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి చెబితేనే అందరికీ తెలిసింది. ఊటీలో షూట్ చేసే కొన్ని సన్నివేశాలలో దివి కనిపించబోతుందట. చిన్న సీన్ అయినప్పటికీ ఆయన దగ్గరుండి  జాగ్రత్తలు తీసుకున్నారట. అంతేకాదు మెగాస్టార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడే సీన్ లో దివి నటించింది. ఇక ఆ క్షణం ఈ జీవితానికి ఇది చాలు అని అనుకుందట బిగ్ బాస్ కంటెస్టెంట్.

మరింత సమాచారం తెలుసుకోండి: