రాజకీయాలకు చిరంజీవి స్వస్తి పలికిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించారు. పవన్ కళ్యాణ్ మెగా కుటుంబ సభ్యులు అంతా కూడా మేమున్నాము అంటూ ముందుకు వస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక రామ్ చరణ్ కూడా తన మద్దతు ఎప్పుడు తన బాబాయికి ఉంటుందని ఎన్నోసార్లు బహిరంగంగా తెలియజేశారు. ఇక నాగబాబు ఇప్పటికే పార్టీలో కొనసాగుతూ పలు కీలకమైన బాధ్యతలు చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఆదేశించలేదు కానీ మెగా కుటుంబం కూడా ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

2019వ సంవత్సరంలో రామ్ చరణ్ ఎన్నికల ప్రచారానికి దిగుతానంటూ చెప్పగా పవన్ కళ్యాణ్ వద్దని తెలియజేసినట్లు సమాచారం. దీంతో రామ్ చరణ్ తన బాబాయ్ మాటక కట్టుబడి రాలేదు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసారి మెగా హీరోలంతా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజాయితీ ని బాధ్యత తనకు చిన్ననాటి నుంచి తెలుసని.. ఫ్యూచర్లో జనసేన పార్టీకి మద్దతు ఇస్తాను లేదో తెలియదని కూడా తెలియజేశారు. ఇక తామద్దరము చెరో పక్క ఉండడం కంటే తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లుగా చిరంజీవి తెలియజేశారు.

ఇక పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల భవిష్యత్తులో తప్పకుండా మంచి నాయకుడవుతారని చిరంజీవి తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్రాన్ని ఏలే సామర్థ్యం కూడా పవన్ కళ్యాణ్ కు ఉందని తెలియజేశారు. పొలిటికల్ పరంగా చిరంజీవి అందుకే సైలెంట్ గా ఉన్నారని తెలియజేశారు. ఇక జనసేన పార్టీకి చిరంజీవి మద్దతిస్తానని కానీ ఇవ్వనని కానీ ఏ విధంగా చెప్పలేదు. దీంతో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ స్పందించడం జరిగింది. దీంతో చిరంజీవి వెనుక నుండి రాజకీయ చక్రం తిప్పుతారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా మెగాస్టార్ మద్దతు జనసేనకు చాలా అవసరమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: