నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తాను నటించిన కొన్ని మూవీ లతో "యు ఎస్ ఏ" లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టాడు. అందులో భాగంగా ఇప్పటి వరకు బాలకృష్ణ తన కెరియర్ లో "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్ లను ఏ మూవీ లతో టచ్ చేసాడో తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ తో బాలకృష్ణ మొట్ట మొదటిvసారి తన కెరియర్ లో "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్ లను టచ్ చేశాడు. బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన అఖండ మూవీ తో రెండవ సారి బాలకృష్ణ తన కెరియర్ లో "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్ లను టచ్ చేశాడు. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగతాన్ని అందించాడు.  ఈ మూవీ లో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించగా , పూర్ణ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మొత్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టి పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా ఇప్పటి వరకు బాలకృష్ణ తన కెరియర్లో రెండు మూవీ లతో "యు ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్ లను టచ్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: