కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ కెరీర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో ఖైదీ సినిమా ఒకటి. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి , టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  

ఇది ఇలా ఉంటే ఖైదీ మూవీ కి సీక్వెల్ ను తెరకెక్కించ బోతున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. లోకేష్ కనకరాజు కొన్ని రోజుల క్రితమే విక్రమ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కబోయే మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు , కార్తీ హీరో గా ఖైదీ 2 మూవీ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఖైదీ 2 మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఖైదీ 2 మూవీ లో కొరియోగ్రాఫర్ కం నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి రాఘవ లారెన్స్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈయన పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: