అలనాటి హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన నటన, డైలాగ్ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తర్వాత స్థానం ప్రభాస్ అందుకోవడంతో ప్రభాస్ కు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ప్రభాస్ కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు.ఇదిలావుంటే  గడిచిన కొన్ని రోజుల క్రితం కృష్ణంరాజు మరణించడం జరిగింది. ఇక కృష్ణంరాజు సినీ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..

అయితే కృష్ణంరాజు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదట 1969 లో సీతాదేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇకపోతే కృష్ణంరాజు, సీతాదేవికి సంతానం లేకపోయేసరికి ఒక కుమార్తెను దత్తత తీసుకున్నారు. 1995 లో ఒక యాక్సిడెంట్ లో సీతా దేవి కన్నుమూయడం జరిగింది.ఇక  దీంతో ఒక్కసారిగా కృష్ణంరాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవ్వడమే కాకుండా చాలా మానసికంగా కృంగిపోయారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే కృష్ణంరాజు సీతాదేవి విషయం నుంచి బయటికి రావడానికి కుటుంబ సభ్యులు సైతం కృష్ణంరాజు ని ఒప్పించి రెండవ వివాహం జరిపించారట.1996లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన శ్యామలాదేవితో వివాహం జరిపించారు.  కృష్ణంరాజు రెండో వివాహం చేసుకునే సమయానికి శ్యామలాదేవి - కృష్ణంరాజు మధ్య 28 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉందని సమాచారం.

 ఇక వీరికి కూడా ముగ్గురు కుమార్తెలు జన్మించారు. ఇక వీరి పేర్లు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి. ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు కృష్ణంరాజు.  అయితే తన కెరియర్ లో దాదాపుగా 200 లకు పైగా సినిమాలలో నటించారు.ఇక  చివరిగా ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇకపోతే కృష్ణంరాజు చివరి రోజుల్లో కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఇక  కోవిడ్ తర్వాత పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన కృష్ణంరాజు చివరికి గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస విడవడం జరిగింది.  ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.కాగా ప్రభాష్ నటించిన ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్-k వంటి సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: