మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ మూవీ ప్రేమమ్ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అందాల ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తన నటనతో , అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఫీదా చేసి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ నిఖిల్ హీ రోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ కార్తికేయ 2 మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం అనుపమ పరమేశ్వరన్ , సిద్దు జొన్నలగడ్డ హీరో గా తెరకెక్కనున్న టిల్లు స్క్వేర్ మూవీ లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కానీ తాజాగా ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ నుండి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఓకే అయిన మూవీ నుండి అనుపమ పరమేశ్వరన్ బయటికి రావడానికి ప్రధాన కారణం ఈ ముద్దు గుమ్మ కు మరో క్రేజీ సినిమా అవకాశం రావడమే అని ఒక వార్త వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కు అవకాశం వచ్చినట్లు , దానితో టిల్లు స్క్వేర్ మూవీ నుండి ఈ ముద్దు గుమ్మ తప్పకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: