ప్రస్తుతం వరుస టీవీ షో లకు  "ఓ టి టి" షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ గా యాంకర్ గాను , నటిగాను కెరియర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తుంది. 

మూవీ కనక సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నట్లు అయితే శ్రీ ముఖి కి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే టీవీ షో లతో  "ఓ టి టి" షో లతో ,  సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో శ్రీ ముఖి ఎక్కువ శాతం తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అదిరిపోయే రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఈ ముద్దు గుమ్మ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: