జూనియర్ ఎన్టీఆర్ నుంచి గత ఐదేళ్లలో కేవలం రెండు సినిమాలే వచ్చాయి. ఆ సినిమాలలో అరవింద సమేత ఒకటి కాగా ఆర్ఆర్ఆర్ మూవీ మరొకటి. ఈ రెండు సినిమాలు కూడా ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి.

అరవింద సమేత తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా కాగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఏకంగా 90 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా వచ్చాయి. 

అరవింద సమేత సినిమాలో శుభలేఖ సుధాకర్ కూడా ముఖ్య పాత్రలో నటించారు. ఒక ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ అరవింద సమేత షూట్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను కూడా పంచుకున్నారు. ఓటీటీలలో కొన్ని సినిమాలు అద్భుతంగా తీస్తున్నారని కూడా ఆయన తెలిపారు. టాలీవుడ్ లో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నారని శుభలేఖ సుధాకర్ కామెంట్లు కూడా చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాతో పాటు దమ్ము సినిమాలో చేశాన్ని శుభలేఖ సుధాకర్ తెలిపారు.అరవింద సమేత మూవీలో చిన్న పాత్ర అయినప్పటికీ మంచి పాత్ర దక్కిందని ఆయన కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదని తారక్ సెట్ లో ఉన్నారంటే అల్లరిగా ఉంటుందని శుభలేఖ సుధాకర్ తెలిపారటా.. తారక్ డైలాగ్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారో కూడా అస్సలు అర్థం కాదని ఆయన అన్నారు. 

నవ్వుతూనే సెట్ లో రెడీ అన్న వెంటనే షూట్ లో పాల్గొని తారక్ నటిస్తారని శుభలేఖ సుధాకర్ కామెంట్లు చేశారటా.. తారక్ తో చాలా సరదాగా ఉంటుందని శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు.మహేష్ బాబు కూడా సెట్ లో సరదాగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. వకీల్ సాబ్ మూవీలో పవన్ కాంబినేషన్ సీన్ ను చేసే పాత్ర కొన్ని కారణాల వల్ల పోయిందని ఆ సినిమాలో హౌస్ ఓనర్ గా కనిపించానని శుభలేఖ సుధాకర్ చెప్పినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: