ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న గత మూడు రోజుల నుంచి ప్రాణాలతో పోరాడుతున్నాడు.బెంగుళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఆయనకి చికిత్స జరుగుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే హాస్పిటల్ కు నందమూరి కుటుంబం వారంతా చేరుకొని తారకరత్నను పరామర్శిస్తున్నారు. నేడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సమేతంగా బెంగుళూరు చేరుకొని తారకరత్న ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్న ఎంతగానో పోరాడుతున్నాడు అని, ఆయన త్వరగా కోలుకొని బయటికి వస్తారని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక తాజాగా తారకరత్నను చూడడానికి మంచు మనోజ్ కూడా బెంగుళూరుకు వెళ్ళాడు. తారకరత్న, తారక్.. మంచు మనోజ్ చిన్నపటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నతనం నుంచి వీరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పెరిగారు. ఆ అభిమానంతోనే తన మిత్రుడు చావుబతుకుల్లో ఉన్నప్పుడు దైర్యం చెప్పడానికి మనోజ్ నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు వెళ్లి తారకరత్నను చూసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


స్నేహితుడిని ఆ పరిస్థితిలో చూడగానే మనోజ్ దుఃఖం ఆపుకోలేక కంటతడి పెట్టుకున్నాడు.ఇక ఆ తరువాత మనోజ్ మీడియా తో మాట్లాడుతూ.. “తారకరత్నను చూడటం జరిగింది.అతను రికవరీ అవుతున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా తారకరత్న తెలుసు. నాకు గట్టి నమ్మకం ఉంది.. త్వరలోనే ఆయన కోలుకొని ఆరోగ్యంగా బయటికి వచ్చేస్తాడు. ఆయన స్ట్రాంగ్ ఫైటర్.. అతను మళ్లీ వచ్చి మళ్లీ యాక్టివ్ గా మారిపోతాడు. ఫస్ట్ నుంచి కూడా తారకరత్న చాలా యాక్టివ్. అతను చేసిన ర్యాలీలు ఇంకా ప్రచారాలు చూస్తూ ఉంటాను. అతను చాలా మంచి వ్యక్తి.. కానీ ఇంతలోనే అనుకోకుండా ఇలా జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వారి లైఫ్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఇంకా పోతూ ఉంటుంది. కానీ అతనికి ఇది టెస్టింగ్ టైమ్.. అతను ఖచ్చితంగా మళ్లీ తిరిగివస్తాడు.. నేను వందశాతం బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆ దేవుడి దయవలన అతను త్వరగా కోలుకొని బయటికి రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ దేవుడ్ని ప్రార్ధించండి.డాక్టర్ లతో మాట్లాడాను.. ఇక వారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు” అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: